Uncategorized

పోచమ్మ తల్లీ.. చల్లంగా చూడు
-మల్కాపూర్ లో బోనాలతో ఊరేగింపుగా వెళ్తున్న మహిళలు
-ఘనంగా బోనాల పండుగ
-ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్సి గౌడ్

దీక్షతెలుగు, న్యూస్ :

పాడి పంటలు ఆయురారోగ్యాలతో గ్రామ ప్రజలు అందరూ సుఖశాంతులతో చల్లంగా ఉండేలా దీవించు పోచమ్మ తల్లి అంటూ అమ్మవారిని తాండూరు మండల బీఆర్ఎస్ పార్టీ బిసి సెల్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ వేడుకున్నారు.గ్రామ దేవత పోచమ్మ తల్లీ చల్లగా చూడాలని కోరుతూ ఆదివారం ప్రజలు ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు.తాండూరు మండల మల్కాపూర్ ఊరేగింపుతో పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలను సమర్పించారు.అమ్మవారి ఆలయం చుట్టూ బోనాలతో ప్రదిక్షణలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.అలాగే ఆర్సి గౌడ్ యువసేన సభ్యులతో కలిసి ఆర్సి గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్సి గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని ఆ తల్లిని వేడుకున్నారు. గ్రామ దేవాలయాల అభివృద్ధి కొరకు తన వంతు సహాయ సహకారం చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్సి గౌడ్ యువసేన సభ్యులు. గ్రామస్తులు, యువకులు, మహిళలు తదితరులు ఉన్నారు.