ప్రభుత్వ హాస్పిటల్స్ లోనే ఎక్కువ ప్రసవాలు జరిగేలా చూడాలి

Uncategorized నల్లగొండ సూర్యాపేట

 

 

 

ప్రభుత్వ హాస్పిటల్స్ లోనే ఎక్కువ ప్రసవాలు జరిగేలా చూడాలి

జిల్లాలో సీజేరియన్లు, ఐ యమ్ ఆర్, యం యమ్ ఆర్ తగ్గించాలి…..

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పై సమీక్ష నిర్వహించిన 

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 18:::: జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్స్ లోనే ఎక్కువ ప్రసవాలు జరిగేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం నాడు జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ నందు డి యమ్ హెచ్ ఓ కోటాచలం తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వైద్య, ఆరోగ్య శాఖ పై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్స్ నందు మెరుగైన ప్రసూతి సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి అధికారులు, ఆశ కార్యకర్తలు ప్రభుత్వ హాస్పిటల్ లోనే ఎక్కువ ప్రసవాలు అయ్యేవిధంగా కృషి చేయాలని, ప్రజలలో ఎక్కువ అవగాహన కల్పించాలని అలాగే ప్రభుత్వ, ప్రెవేట్ హాస్పిటల్స్ లో ఎక్కువగా సీజేరియన్లు జరుగుతున్నాయని వాటిని తగ్గించేందుకు నిరంతరం అన్ని ప్రెవేట్ హాస్పిటల్స్ పర్యవేక్షణ చేస్తూ సాధారణ ప్రసవాలు ఎక్కువ జరిగేలా కృషి చేయాలని సూచించారు.మాత శిశు సంరక్షణ కేంద్రం నందు ప్రసవాల సేవలు కొరకు వచ్చే ప్రసూతిల కొరకు నమోదు చేయుటకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డి యమ్ హెచ్ ఓ కి సూచించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా మహిళలకు అన్ని రకాల వైద్య పరీక్షలు, సేవలు అందించాలని సూచించారు. జిల్లాలో ఎస్ ఎ యమ్ (SAM ),యమ్ ఎ యమ్ (MAM ) లక్ష్యాన్ని చేరేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు.

ఐ యమ్ ఆర్ (IMR ), యమ్ యమ్ ఆర్ (MMR ) జిల్లా లో సున్నా కి చేరేలా అధికారులు ప్రయత్నించలని సూచించారు.

క్షయ (టి బి ), పైలేరియా పై ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు  ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి యమ్ హెచ్ ఓ డాక్టర్ చంద్రశేఖర్,డాక్టర్ ఉమ మహేశ్వరీ,డాక్టర్ నాజియా, డాక్టర్ జయ మనోహరి, డాక్టర్ శ్రీశైలం, డాక్టర్ అనిత రాణి, డాక్టర్ సతీష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.