మాజీ ఎమ్మెల్యే నివాసంలో మహా పడిపూజ పాల్గొన్న ఆర్ సి గౌడ్
తాండూర్ మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 18::: శ్రీ ధర్మశాస్త్ర మాహ అయ్యప్ప పడిపూజ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో అంగ రంగ వైభవంగా జరిగింది. బుధవారం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప మా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి ఆహ్వానం మెరకు వారి నివాసంలో నిర్వహిస్తున్నశ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమానికి తాండూర్ నియోజక ముఖ్య నాయకులు మరియు తాండూర్ మండల బిసి సెల్ అధ్యక్షులు ఆర్.సీ గౌడ్అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమానికి భారీ ఎత్తున అయ్యప్ప స్వాములు ప్రజా ప్రతినిధులు నాయకులు రోహిత్ రెడ్డి అభిమానులు ఆర్ సి గౌడ్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.