⏩:::86 మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందజేసిన జివైఎఫ్ బీసీ సంఘం ప్రతినిధులు
⏩::రానున్న రోజుల్లో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తాం
⏩::మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా నడుచుకుందాం
⏩::జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
తాండూర్ మీ న్యూస్ ప్రతినిధి::
సాంఘిక సంస్కర్త విద్యా ప్రదావి మాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని గ్లోబల్ యువతరం ఫౌండేషన్ మరియు బీసీ సంఘం ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలో సింధు జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళా కు విశేష స్పందన లభించింది హైదరాబాద్ కు చెందిన పది మల్టీ నేషనల్ కంపెనీల(టెక్ మహీంద్రా, ఎబుక్కాస్, అపోలో ఫార్మసీ, శ్రీరామ్ చిట్స్, విజయ డయాగ్నొస్టిక్, మెడిప్లస్, ముత్తూట్ ఫైనాన్స్, మార్వెల్ బయోకేం, ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) హెచ్ఆర్లు కోఆర్డినేటర్లు, పాల్గొన్నారు తాండూరు మరియు చుట్టుపక్కల ప్రాంతం నుండి దాదాపుగా 300 పైగా నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు 86 మందికి పైగా నిరుద్యోగులకు వివిధ కంపెనీల్లో జివైఎఫ్ మరియు బీసీ సంఘం ప్రతినిధులు నియామక పత్రం అందజేశారు.మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి మెగా జాబ్ మేళాను ప్రారంభించిన బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్ కందుకూరి రాజ్ కుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలేని ఆదర్శంగా తీసుకొని యువతకు జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలతో జాబ్ మేళాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్లోబల్ యువతరం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మంబాపూర్ విజయేందర్ కార్యదర్శి అరుణ్ రాజ్ అంబేద్కర్ కళాశాల కరస్పాండెంట్ రంగారావు ప్రముఖ వ్యాపారవేత నితిన్ సోమని, రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ స్కూల్ సుకూర్, చీఫ్ రిక్రూట్మెంట్ ఆఫీసర్ వై . రమేష్ , విద్యావంతులు పర్యాద రామకృష్ణ, బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు అనిత, ఉపాధ్యక్షురాలు మంజుల, కార్యదర్శులు లక్ష్మీ నరసమ్మ, విజయలక్ష్మి, బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పెద్దముల్ తాండూర్ యాలాల్ మండల అధ్యక్షులు శ్రవణ్ కుమార్, బసంత్ కుమార్, లక్ష్మణ చారి, బషీరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగదీశ్వర్, యూత్ ప్రజెంట్ సిద్ధార్థ గౌడ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బసవరాజ్, యువ నాయకులు గౌతమ్ రాజ్, గిర్జాపురం రమేష్ తదితరులు పాల్గొన్నారు