తాండూర్ర్  మండల బిసి సెల్ అధ్యక్షులు ఆర్ సి గౌడ్ కి   ఘన సన్మానం 

Uncategorized తాండూర్ తాండూర్ మల్కాపూర్ రాజాకియం వికారాబాద్

తాండూర్ర్  మండల బిసి సెల్ అధ్యక్షులు ఆర్ సి గౌడ్ కి   ఘన సన్మానం 

 — ఆటో యూనియన్ సభ్యులు అన్నదాన కార్యక్రమం.

 — అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న తాండూర్ మండల బిసిల అధ్యక్షులు ఆర్సి గౌడ్

 —  కో ఆప్షన్   సభ్యులు శంషుద్దీన్

 — మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ హుస్సేన్ పటేల్

అన్ని దానాలకన్న అన్నదానం గోప్పదని తాండూర్ మండలం బిసి సెల్ అధ్యక్షులు ఆర్సి గౌడ్ అన్నారు మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 2 :::: తాండూరు మండలం మల్కాపూర్ గ్రామ కొలువు దీరిన దర్గాలో ఆటో యూనియన్ డ్రైవర్ సభ్యుల ఆహ్వాన మేరకు ముఖ్యఅతిథిగా తాండూర్ మండల బీసీ సెల్ అధ్యక్షులు ఆర్ సి గౌడ్, కో ఆప్షన్ సభ్యులు ఎండి శంషాద్దీన్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ హుస్సేన్ పటేల్ వారిని ఘనంగా సన్మానించిన ఆటో యూనియన్ సభ్యులు, తాండూరు మండల బిసి సెల్ అధ్యక్షులు ఆర్ సి గౌడ్ గ్రామ సమీపంలో ఉన్న దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. ఆటో యూనియన్ సభ్యులు దర్గా ప్రాంగణంలో భక్తులను ఉద్దేశించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా తాండూర్ మండల బిసిల్ అధ్యక్షులు ఆర్ సి గౌడ్ మాట్లాడుతూ దర్గా సన్నిధిలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న ఆటో యూనియన్ సభ్యులకు ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని తెలిపారు, అలాగే గ్రామ ప్రజలపై నిరంతరం దేవుడు ఆశీస్సులు ఉండాలని దర్గాలో వేడుకున్నాడు.కోరిన కోరికలు తీర్చి దర్గా ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు గ్రామ పెద్దలు యువకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

 .