మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 2 :: సూర్యాపేట జిల్లా మునగాల మండలం కలకోవా గ్రామం నుండి సతీష్, మహేష్ అని ఇద్దరు యువకులు స్నేహితుని జన్మదిన వేడుకలకు హెచ్ ఎం డీలక్స్ బైక్ పై బయలుదేరగా మునగాల మండలం మెద్దుల చెరువు గ్రామం దగ్గర బైక్ అదుపుతప్పి బ్రిడ్జ్ కి ఢీకొనగా ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉంది స్థానికులు ఆంబులెన్స్ కి సమాచారం ఇవ్వగా స్థానికుల సాయంతో ఆంబులెన్స్ ద్వారా సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగినది.