_భద్రత ప్రమాద భీమా చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్
మీ న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 26::సూర్యాపేట జిల్లా అర్ముడ్ రిజర్వ్ నందు పని చేస్తున్న కానిస్టేబుల్ కోటేశ్వరరావు ఆకాలంగా మరణించడం జరిగినది. ఇతని కుటుంబ సభ్యులకు పోలీసు భద్రత స్కీమ్ ద్వారా 8 లక్షల రూపాయల చెక్కును ఈరోజు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ జిల్లా పోలీసు కార్యాలయం నందు అందించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది కుటుంబాల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పోలీసు శాఖ కృషి చేస్తుంది. భద్రత పథకం సిబ్బంది కుటుంబాలకు బాసటగా ఉన్నది అన్నారు. ఈ కార్యక్రమం నందు అధనపు ఎస్పి నాగేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు, పోలీసు సమంఘం సభ్యులు వెంకన్న, సెక్షన్ సూపరింటెండెంట్ విజయ్, సిబ్బంది పాల్గొన్నారు.