అధిక ధరలకు వ్యతిరేకంగా అక్టోబర్ 17 నుండి 28 వరకు దేశవ్యాప్తంగా జరిగే ఆందోళనను జయప్రదం చేయండి.

Uncategorized నల్లగొండ రాజాకియం సూర్యాపేట

అధిక ధరలకు వ్యతిరేకంగా అక్టోబర్ 17 నుండి 28 వరకు దేశవ్యాప్తంగా జరిగే ఆందోళనను జయప్రదం చేయండి.

 సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
 మీ:: న్యూస్ అక్టోబర్15..సూర్యాపేట: దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న అధిక ధరలకు వ్యతిరేకంగా అక్టోబర్ 17 నుండి 28 వరకు జరిగే దేశవ్యాప్త ఆందోళన జయప్రదం చేయాలని సిపిఐ(ఎం ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిపిలుపునిచ్చారు.మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన సిపిఐ(ఎం ) సూర్యాపేట జిల్లా కార్యదర్శి వర్గం సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు దేశవ్యాప్తంగా అన్ని రకాల నిత్యవసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలను అరికట్టేందుకు చర్యలు చేపట్టడంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం గోరంగా వైఫైల్యం చెందిందని విమర్శించారు. పెరిగిన ధరలతోపేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధరల భారం ప్రజలపై పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ ఆహార సంస్థలో మొలుగుతున్న బియ్యం, గోధుమలు తదితర వస్తువులను పేదలకు ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. బ్లాక్ మార్కెట్ లో నిలువ ఉంచిన నిత్యవసర వస్తువులను వెలికి తీసి పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతోపేద, మధ్యతరగతి కలగకుండా చూడాలన్నారు. మూసి కాలువపై నివాసముంటున్న పేదలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి వారికి ఇల్లు నిర్మించిన తర్వాత పేదల ఇండ్లను కూల్చివేయాలని సూచించారు. రైతు బంధు, రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను పక్కకు పెట్టి ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధిపై దృష్టిసారించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ(ఎం ) నిరంతరం కష్టజీవుల హక్కుల కోసం పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. సిపిఐ (ఎం ) పార్టీ గ్రామస్థాయి నుండి, ఆల్ ఇండియా స్థాయి వరకు మహాసభలు నిర్వహిస్తున్నామని ఈ మహాసభల సందర్భంగా లోపాలను సవరించుకొని భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకొని పార్టీ విస్తరణ పై దృష్టిపెడుతున్నామన్నారు. ఈ మహాసభల విజయవంతం కై ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. సిపిఐ(ఎం ) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సి పి ఐ (ఎం ) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, నగరపు పాండు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.