పెస్టిసైడ్స్ అండ్ పెస్టిలైజర్స్ ను పరిశీలించిన ఏ డి ఏ
మీ::న్యూస్… మోతే : మండల పరిధిలోని రాఘవపురం ఎక్స్ రోడ్ వద్ద నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ షాపును కోదాడ ఏ డి ఏ యల్లయ్య శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా ను ఎమ్మార్పీ ధరల కంటే అదనంగా అమ్ముతున్నారని రైతు ఫిర్యాదు చేయడం ద్వారా షాపులో విచారణ చేయడం జరిగింది అని తెలిపారు. కొంత మంది రైతులతో మాట్లాడగా ఈ షాప్ లో యూరియా ఎమ్మార్పీ ధరలకే విక్రయాలు నిర్వహిస్తున్నారని రైతుల విచారణలో తేలపడం జరిందని తెలిపారు. ఫర్టిలైజర్ పెస్టిసైడ్ షాప్ నిర్వాహకులు రైతులకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా విక్రయాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమం లో రైతులు, తదితరులు ఉన్నారు.