నాలుగు DAలను వెంటనే ప్రకటించాలి- నిమ్మల శ్రీనివాస్
మీ:: న్యూస్ అక్టోబర్ 15.. ఉపాధ్యాయ ఉద్యోగులకు నాలుగు DA వెంటనే ప్రకటించాలని తెలంగాణా ప్రాగెసివ్ టీచరీ యూనియన్ (టి.పి.టి.యు) సూర్యాపేట జిల్లా అసోసియోట్ (ప్రెసిడెంట్ నిమ్మల శ్రీనివాస్ ప్రభుతాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పెరుగు తున్న ద రలకు అనుగుణంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి కరువు బత్యాన్ని పెంచాలి. కాని 2022 జులై నుండ చెల్లించడం లేదు. దైనందిన జీవితంలో పెరిగే కూరగాయలు, కిరాణం, పెట్రోలు వంటి వాటివలన ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ప్రతి సంవత్సరం జనవరి మరియు జూలై నెలలో కేంద్ర ప్రభత్వం ప్రకటిస్తుంది. దాని ఆధారంగా రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్య ఉద్యోగులకు డి.ఎ (కరువు భత్యం) లని ప్రక టించేవి. కాని గత రెండున్నర సంవత్సరాలనుండి కరువు భత్యాన్ని ప్రకటించడం లేదు. కావున పెండింగ్ లో ఉన్న డి.ఎ లను వెంటనే ప్రకటించాలిని ప్రకటనలు తెలియి చేశారు.