మీ న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 20: సూర్య పేట్ జిల్లా కోదాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గా పని చేస్తున్న జడ్జి శ్యాం సుందర్ కు ఇటీవల సీనియర్ సివిల్ జడ్జి గా పదోన్నతి లభించింది.ఆయన భువనగిరి లో సీనియర్ సివిల్ జడ్జి గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్బంగా ఆయన్ను కోదాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ ఆర్ కే మూర్తి మాట్లాడుతూ కోదాడలో మూడు సంవత్సరాల పాటు న్యాయమూర్తి గా పని చేసి అందరి అభిమానాన్ని చూరగొన్నారని ప్రశంసించారు. కక్షిదారులకు కౌన్సెలింగ్ చేస్తూ కేసు ల పరిష్కారంలో చొరవ చూపించారని అన్నారు. ఆయనకు పదోన్నతి లభించడం హర్షణీయం అని, భవిష్యత్తులో ఆయన మరిన్ని పదోన్నతులు సాధించాలని ఆకాంక్షించారు.