మీ::న్యూస్… మోతె : గత సర్పంచ్ పాలనలో గ్రామపంచాయతీలో అక్రమాలు జరిగాయని గ్రామస్తులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో బుధవారం మండల పరిధిలోని నామవరం గ్రామంలో డిపివో నారాయణరెడ్డి విచారణ చేపట్టారు. 2019 – 24 సర్పంచ్ పదవి కాలంలో అక్రమాలు జరిగాయని, దానిపై విచారణ చేపట్టాలని గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు, దీంతో అధికారులు గ్రామపంచాయతీలో వార్డ్ మెంబర్లను పిలిచి వివరాలు తీసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. విచారణ అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని డిపివో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆంజనేయులు, కార్యదర్శి మౌనిక, శ్రావణ్ కుమార్ తదితరులు ఉన్నారు.