మీ:: న్యూస్ అక్టోబర్ 8 సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం ఖానాపూరం గ్రామపంచాయతీ సిబ్బందికి సిపిఐ పార్టీ అండగా ఉంటుంది.. సిపిఐ మండల కార్యదర్శి బద్దం కృష్ణారెడ్డి…అనంతగిరి మండలం ఖానాపురం గ్రామపంచాయతీ 5 గురు సిబ్బందికి గడిచిన ఏడు నెలల జీతాలు పెండింగ్లో ఉండడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే వారికి జీతాలను చెల్లించాలని సిపిఐ పార్టీ అనంతగిరి మండల కార్యదర్శి బద్దం కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ….. అధికారులు చేసిన తప్పిదం వల్ల ఎకౌంట్లో వారికి జీతాలు పడలేదని దీంతో వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు వెంటనే పరిష్కరించాల్సిన అధికారులు అలసత్వంగా ఉండటం సరైనదే కాదన్నారు. జీతాల మీద బతికే ఆ సిబ్బంది ఐదుగురు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఇదే విషయమే వారు మా దృష్టికి తీసుకు వచ్చారని తెలిపారు. వారికి సిపిఐ పార్టీ అండగా ఉంటుందని తక్షణమే వారు జీతాలను చెల్లించని పక్షంలో వారి తరఫున ఉద్యమం చేయబడతామని హెచ్చరించారు.