ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిలిపివేయాలని కలెక్టర్ కు వినతి

Uncategorized నల్లగొండ సూర్యాపేట

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిలిపివేయాలని కలెక్టర్ కు వినతి

 

 

 మీ:: న్యూస్ అక్టోబర్ 7… ఈనెల 11వ తారీఖున తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కు వినతి పత్రం అందజేసిన బి.ఆర్.ఎస్ నాయకులు ఈ సందర్భంగా BRS పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ నాయకులు తడకమళ్ళ రవికుమార్ మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రం విద్యా, వైద్యా, రవాణా రంగాలలో ఇలా అన్ని వెనకబాటుకి గురి అయిందని ఏన్ని ప్రభుత్వాలు మారినా తుంగతుర్తి తలరాత మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గ కేంద్రానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసిందని దానిని స్థానిక ఎమ్మెల్యే మందుల శామ్యూల్ తుంగతుర్తి మండలంలో ప్రభుత్వ భూమి లేదా అనే సాకుతో తొండ, తిరుమలగిరిలో నిర్మించడానికి ప్రతిపాదనలు పంపించారన్నారు. తుంగతుర్తి మండల పరిధిలోని కరివిరాల కొత్తగూడెం గ్రామంలో 365 జాతీయ రహదారి ఆనుకొని 20 నుండి 30 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు. ఈ విషయంపై తమరు జోక్యం చేసుకొని తుంగతుర్తి ప్రాంతానికి అన్యాయం జరగకుండా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి నియోజకవర్గ కేంద్రంలోనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని కోరమని తెలిపారు. జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో బొంకూరు మల్లేష్, కొండగడుపుల వెంకటేష్, తడకమళ్ళ మల్లికార్జున్, చింతకుంట్ల సురేష్, కొండగడుపుల శ్రీను తదితరులు పాల్గొన్నారు