తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఒంటెద్దు పోకడతో సీనియర్ కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి..

Uncategorized నల్లగొండ నూతన కల్ సూర్యాపేట
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఒంటెద్దు పోకడతో సీనియర్ కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి..
దగాపడ్డ కాంగ్రెస్ నాయకుల్లారా కదలిరండి పేరుతో సీనియర్ నాయకుల సమావేశం ఏర్పాటు..
సమావేశాన్ని ఆపేందుకు నాయకులను అర్థరాత్రి అరెస్టు చేసిన పోలీసులు..
మండల పోలీస్ స్టేషన్ ముందు కాంగ్రెస్ నాయకుల ధర్నా…
నూతనకల్ మీ న్యూస్ ప్రతినిధి అనంతుల చంద్రయ్య : తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ నియోజకవర్గంలో చేస్తున్న పనితీరు, కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు పట్ల ప్రవర్తిస్తున్న పద్ధతి,రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు మండలాల్లో,ఇటు గ్రామాల్లో నిలబెట్టే అభ్యర్థుల విషయమై పోతున్న ఒంటెద్దు పోకడ నచ్చని కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా ఏకమై దగాపడ్డ కాంగ్రెస్ నాయకుల్లారా కదలిరండి అనే పేరుతో డిసిసి ఉపాధ్యక్షులు యోగానందచారి ఆధ్వర్యంలో జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు.సమావేశ విషయం తెలుసుకున్న పోలీసులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మోరపాక సత్యం,తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేల్పుల రమేష్,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నరసింగ శ్రీనివాస్ గౌడ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నజీర్ గౌడ్ లను శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు అక్రమంగా అరెస్టు చేసి నూతనకల్ మండల పోలీస్ స్టేషన్ కు తరలించారు.దీనితో భగ్గుమన్న కాంగ్రెస్ నాయకులు నూతనకల్ మండల పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు.అక్రమంగా అరెస్టు చేసిన కాంగ్రెస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయించడం ఎమ్మెల్యే సామేలుకే సాధ్యమైందని,అధికార పార్టీ ఎమ్మెల్యేనే అధికార పార్టీ నాయకులను అరెస్టు చేయించడం ఏంటని ప్రశ్నించారు.ఎమ్మెల్యే తన తీరు మార్చుకోకపోతే సీనియర్ నాయకులంతా ఏకమై ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి,మాజీ మంత్రి దామోదర్ రెడ్డి,వీరితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తామని తెలిపారు.అనంతరం సొంత పూచికత్తుపై అరెస్టు చేసిన వారిని విడుదల చేయించారు.ఈ కార్యక్రమంలో జాజిరెడ్డిగూడెం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు,ఎన్ ఎస్ యు ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు