పదకొండవ రోజుకు చేరిన VOA ల సమ్మె

Uncategorized తాండూర్ బషీరాబాద్ వికారాబాద్ సమ్మె

VOA ల సమ్మె కు మద్దతు తెలిపిన సిఐటియు

 

••సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ పోరాటం ప్రభుత్వంపై ఉధృతం చేస్తాం

••సిఐటియు వికారాబాద్ జిల్లా కార్యదర్శి కేశ్రీనివాస్ 

మీ న్యూస్ ప్రతినిధి::

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఐకేపి VOA లకు 20000 వేతనం ఇస్తామని,అర్హులైన VOA లకు సీసీ లుగా పదోన్నతులు కల్పిస్తామని, అదనపు పని భారాలు తగ్గిస్తామని తదితర అనేక హామీలు ఇచ్చిందని తెలిపారు.కానీ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోగ,జాబ్ చార్ట్ లో లేని పనులు చేయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె నిర్వహించి తొమ్మిదవ రోజు చేరిన ప్రభుత్వం ఏమి వినబడనట్లు వ్యవహారిస్తుందని విమర్శించారు.

తెలంగాణ ఐకెపి వివోఏ ఉద్యోగుల సంఘం(సిఐటియు అనుబంధం)ప్రభుత్వం తమ యూనియన్ నాయకత్వంలో చేసిన దశల వారి పోరాటాల ఫలితంగా అనేక హామీలు ఇచ్చిందని అన్నారు.ఇప్పటికే 78 రకాల పనులు, 14 రకాల యాప్ లతో వెట్టి చాకిరీ చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ రెండు లోపు తమకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే దీర్ఘకాల ఉద్యమానికి సిద్ధమవుతామని, చెప్పిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం విడ్డురంగా ఉన్నదని, వెంటనే voa సమస్య పరిష్కారం చేయలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన ఉదృతం చేస్తామని ప్రభుత్వన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మండల అధ్యక్షులు ఈ నర్సింలు గౌడ్ ఐకేపి VOA లలు తదితరులు పాల్గొన్నారు.