దేశ రక్షణకు యువతను తయారు చేయడే లక్ష్యం

Uncategorized తెలంగాణ నల్లగొండ రాజాకియం సూర్యాపేట స్పోర్ట్స్

దేశ రక్షణకు యువతను తయారు చేయడే లక్ష్యం

===జిల్లా కేంద్రంలో శ్రీ సాయి వైష్ణవి సైనిక్ అకాడమి ప్రారంభం

===తల్లుల చేతుల మీదుగా ప్రారంభించిన నిర్వహకులు

సూర్య పేట్ జిల్లా ఇంచార్జీ కోల రవీందర్ గౌడ్ 

సూర్యాపేటః దేశ రక్షణకు నేటి తరం యువతను తయారు చేయడమే లక్ష్యంగా శ్రీ సాయి వైష్ణవి సైనిక్ అకాడమి పని చేస్తుందని మేనేజింగ్ డైరెక్టర్ గొట్టిపర్తి శ్రీకాంత్, అకాడమిక్ డైరెక్టర్ గుడిపూడి కృష్ణ లు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంకు వెళ్లే దారిలో శ్రీ సాయి వైష్ణవి సైనిక్ అకాడమిని వారి తల్లులు గొట్టిపర్తి భిక్షమమ్మ, గూడిపుడి వెంకమ్మల చేతుల మీదుగా ప్రారంబోత్సవం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను క్రమశిక్షణతో ఉండేలా, పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చేలా శిక్షణ ఇస్తామన్నారు. తమ అకాడమిలో సైనిక్ స్కూల్ తో పాటు రాష్ర్టీయ మిలటరీ స్కూల్, నవోదయ స్కూల్ లలో ఎంట్రన్స్ పరీక్షలకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ పరీక్షలకు జనవరి 2025 వరకు 12, 15 సంవత్సరాల లోపు ఉన్నవారు అర్హులని తెలిపారు. తమ అకాడమిలో వారం రోజుల పాటు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు డెమో తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి క్రమశిక్షణతతో ముందుకు సాగేలా తీర్చిదిద్దుతామన్నారు. అకాడమి ప్రారంభోత్సవంలో జబర్దస్త్ టీం సభ్యులు సందడి చేశారు. వారు చేసిన స్కీట్ లు విద్యార్థులు, సభికులను అలరించాయి. ఈ కార్యక్రమంలో అనంతుల వెంకన్న గౌడ్, జబర్దస్త్ టీం సభ్యులు వెంకి మంకి, చిత్రం శ్రీను, వినోదిని, హరిత, చిట్టిబాబు, నాగతేజ, నాగిరెడ్డి, లండన్ డ్రాయర్, పిట్టల శ్రీకాంత్, కరుణకర్, వంశీ, సాయి చరణ, విద్యార్థులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.