అధికార, ప్రధాన ప్రతిపక్ష నాయకుల వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు
మీ:: న్యూస్ అక్టోబర్ 6…మోతే : అధికార, ప్రధానప్రతిపక్ష పార్టీల నాయకులు వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనం అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు అన్నారు. శనివారంమండల పరిధిలోని సిరికొండ గ్రామంలో జరిగిన సిపిఎం పార్టీ శాఖ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఒకరిపై ఒకరు అసభ్య పదజాలం వాడడం చూస్తుంటే రాజకీయాల్లో నైతిక విలువలు రోజురోజుకు దిగజారుతున్నాయని అనడానికి కారణం గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలే నిదర్శనం అని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక విధంగా అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతూ బూతులు మాట్లాడుతూ రాజకీయాలను కలుషితం చేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యానాలు బూర్జవ రాజకీయాలకు అద్దం పడుతుందని ఆరోపించారు. హైడ్రా పేరుతో జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే ప్రజలకు మేలు జరిగేది పోయి రాజకీయ ప్రయోజనం ఆశించినట్టుగా అధికార ప్రతిపక్ష తీరు కనపడుతుందని అన్నారు. బడా బాబులు ఆక్రమించిన ప్రభుత్వ స్థలాలను ఏ పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం వదిలి వెయ్యకూడదని అదే సందర్భంలో నిరుపేదలు గుడిసెలు వేసుకున్న ఇళ్ల కు పునర్ నివాసం కల్పించిన తర్వాతనే గుడిసెలను తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని ప్రధాన ప్రతిపక్షం ఉచ్చులో పడకూడదని అన్నారు. బిజెపి టిఆర్ఎస్ ప్రజల కోసం పనిచేయాలి తప్ప విమర్శలే ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకోకూడదని అన్నారు. ప్రతిపక్ష పార్టీ అయినా టిఆర్ఎస్ పార్టీ ఇంకా మేము అధికారంలో ఉన్నాము అనే భ్రమలో ఉన్నారని ఆ బ్రహ్మ నుo తొలగించుకోవాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీ స్కీములను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సిపిఎం లో చేరిక
బిక్యా తండా గ్రామ కి చెందిన బానోత్ వెంకటేష్ సిపిఎం పార్టీలో చేరారు.ఆయనకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుమట్టిపల్లి సైదులు ఎర్ర కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శిగా కాంపాటి శ్రీను ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.సిపిఎం మండల కమిటీ సభ్యులు మీసాల వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ శాఖ మహాసభలో సిపిఎం మండల కమిటీ సభ్యులు గుంట గాని ఏసు, కాంపాటి శ్రీను, చర్లపల్లి మల్లయ్య, బానోతు లచ్చిరాం కిన్నెర పోతయ్య , బూడిద లింగయ్య,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకురాలు జంపాల స్వరాజ్యం, నాయకులు కాంపాటి జానయ్య, పిడమర్తి అశోక్, బోడపట్ల హుస్సేన్, బానోత్ రమేష్, వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అక్కినపల్లి వినయ్ తదితరులు పాల్గొన్నారు.