అనుమతులన్నింటినీ రద్దు చేసేంతవరకుఐక్యంగా ఉద్యమిస్తాం
అఖిలపక్షాలు, ప్రజా సంఘాల సమావేశంలో వక్తల పిలుపు
మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 16 ::: మోతే: ఎన్ఎంకే ఇథనాల్ కంపెనీకి ఇచ్చిన అనుమతులు రద్దు అయ్యేంతవరకు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యంగా ఉద్యమాలు ఉదృతంగా నిర్మిస్తామని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చాయి. సోమవారం మోతే మోతే మండలం రావి పహాడ్ గ్రామ లోని గ్రామపంచాయతీ కార్యాలయం ముందు అఖిలపక్ష పార్టీల, ప్రజా సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోతే మండలం రావి పహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న ఎన్ఎంకె ఇథనాల్ కంపెనీ పనులు పూర్తి అయితే చుట్టుపక్కన గ్రామాలైన ఆత్మకూర్ (ఎస్) మండలంశెట్టి గూడెం, కోట పహాడ్, మోతే మండలం సర్వారం, కూడలి, అప్పన్నగూడెం, బురకచర్ల, గోల్ తండా, మేకల పాటి తండా, సిరికొండ గ్రామాలతో పాటు అనేక గిరిజన తండాలు, వీటితో పాటు చుట్టుపక్కన ఉన్న అనేక గ్రామాలలో నివాసం ఉంటున్న ప్రజల ఆరోగ్యం పైఇథనాల్ కంపెనీ కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.ఈ ఇథనాల్ కంపెనీ కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధుల తో పాటు గుండె, మెదడు, కిడ్నీ, లివర్ తదితర వ్యాధులకు గురై ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం నెలకొని ఉందన్నారు. దీని మూలంగా భవిష్యత్తులో చుట్టూ 20 కిలోమీటర్ల మేర మనుషులు బతికే పరిస్థితి ఉండదన్నారు. ఈ ఫ్యాక్టరీ కాలుష్యం మూలంగా రైతుల పంటలు పూర్తిగా నాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బంగారo పండే పంట భూములు బీడు భూములుగా మారే పెను ప్రమాదం ఉందన్నారు.ఈ ఫ్యాక్టరీ నుండి విడుదల అయ్యే వ్యర్ధాలను పక్కనే ఉన్న పాలేరు రిజర్వాయర్ లోకి వదిలితే చుట్టుపక్కన ఉన్న భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోయి నీరు కలుషితంగా మారి ప్రజలు, రైతులు, పశువులు, చేపలు, మూగజీవులు చనిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయమై తక్షణమే అధికార ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ఇథనాల్ కంపెనీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా 35 మంది తో ఎన్ఎంకె ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అన్ని గ్రామాలలో కమిటీల నిర్మాణం చేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఒక్కంతుల కోటేశ్వరరావు, బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శీలం సైదులు యాదవ్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, సిపిఐ జిల్లా నాయకులు దంతాల రాంబాబు, బహుజన మహాసభ జిల్లా నాయకులు నారబోయిన వెంకట్ యాదవ్, పిడిఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు యాదవ్, రైతాంగ సమితి జిల్లా నాయకులు నల్లెడ మాధవరెడ్డి, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు, పిడిఎస్యు రాష్ట్ర నాయకులు పోలేపోయిన కిరణ్, నాయకులురాయరి చిన్న, కాకి సురేందర్ రెడ్డి, కాంపాటి దిలీప్, ఉప్పుల సందీప్, కాకి నారాయణ రెడ్డి, వెలుగు మధు చేగువేరా, కాకి మోహన్ రెడ్డి, పోడ పంగి ముత్తయ్య, పందిళ్ళపల్లి మల్లారావు, పో డపంగి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.