మీ:: న్యూస్ ప్రతినిధి సూర్యాపేట ఇన్చార్జి జిల్లా కోల రవీందర్ గౌడ్:: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కోర్టు ఎదురుగా ఉన్న బడ్డీ కొట్టను తొలగించి మమ్మల్ని రోడ్డుమీద పడవేయవద్దు అంటూ పలువురు చిరు వ్యాపారులు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ని కలిసి వినతి పత్రం అందించారు. గత 20 సంవత్సరాలుగా చిన్న చిన్న బడ్డీ కోట్లు పెట్టుకుని ఉపాధి పొందుతూ బతుకుతున్నామని ఇటీవల కోర్టు వారు బడ్డి కోట్లను తొలగించాలంటూ నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. వీటిపై 30 కుటుంబాలు బతుకుతున్నాయని మానవతా దృక్పథంతో తమ బడ్డీ కోట్లను తొలగించకుండా చూడాలంటూ ఎమ్మెల్యేను వేడుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు తమను తొలగించబోమని అతి త్వరలో పురపాలక సంఘం తరఫున దుకాణాలు నిర్మించి ఉపాధి చూపిస్తామని చిరు వ్యాపారులకు హామీ ఇచ్చారు…………