ఈనెల 24 ఆదివారం ఆత్మకూరు ఏస్ మండలం పాత సూర్యాపేట స్టేజి వద్ద గల శ్రీ సంతోషిమాత ఉద్యానవన క్షేత్రంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శ్రీ సంతోషి రూపా దేవి సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు నూక వెంకటేశం గుప్తా,బ్రాహ్మండ్లపల్లి మురళీధర్లు తెలిపారు. శుక్రవారం ఉద్యానవన క్షేత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా సూర్యాపేట శ్రీ సంతోషి మాత దేవాలయం ఆధ్వర్యంలో శ్రీ సంతోషి రూపా దేవి సేవాసమితి సహకారంతో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం పార్దివలింగాభిషేకం గంగానది దీపోత్సవం కాశీ నుండి తెచ్చిన 108 శివ లింగాలతో మహాన్యాస రుద్రాభిషేకం, తులసి పూజలు ఆమలక పూజలు సంతోషిమాత పూజలు, మ్యూజికల్ చైర్స్, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక మాస వన సమారాధన లో స్వామి ప్రసాదంగా భోజనం చేసి తరించగలరనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమ శ్రీశైలం, బెలిదే అశోక్, కొత్త మల్లికార్జున్, యమ వెంకటేశ్వర్లు, ముదిరెడ్డి లింగారెడ్డి, దేవర్శెట్టి సోమయ్య తాళ్లపల్లి రామయ్య బ్రాహ్మండ్లపల్లి మనోహర్, బజ్జూరిశ్రీనివాస్, బ్రాహ్మండ్లపల్లి శివప్రసాద్, చింతా వెంకన్న, జగదీశ్వరి, కనక రత్నం, బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు..