క్రీడా స్ఫూర్తి ని ప్రపంచానికి చాటి చెప్పిన అభినవ్….
అభినవ్ ను ఆదర్శంగా తీసుకోవాలి……..
ఘనంగా ఆసియా చెస్ ఛాంపియన్ మేకల అభినవ్ 23వ వర్ధంతి…….
మీ:: న్యూస్ ప్రతినిధి::సూర్యాపేట జిల్లా ఇన్చార్జి కోల రవీందర్ గౌడ్ ::క్రీడా స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప క్రీడాకారుడు మేకల అభినవ్ అని పలువురు రాజకీయ నాయకులు, పట్టణ ప్రముఖులు పేర్కొన్నారు.సోమవారం మేకల అభినవ్ 23 వ వర్ధంతి సందర్భంగా దొంగరి శ్రీను ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బాలుర హైస్కూల్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి అభినవ్ తల్లిదండ్రులు మేకల. వెంకటేశ్వర్లు, అరుణాలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అభినవ్ స్పూర్తితో కోదాడ నుండి భావి క్రీడాకారులు చెస్ లో రాణించాలన్నారు. కోదాడ ఖ్యాతిని ఖండాంత రాలకు వ్యాపింప జేసిన అభినవ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. నేటి యువత అభినవ్ ను ఆదర్శంగా తీసుకొని క్రీడల్లో రాణించాలన్నారు. అనంతరం బాలుర హైస్కూల్లో పదవ తరగతిలో టాపర్ గా నిలిచిన విద్యార్థినికి నగదు ప్రోత్సాహాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అభినవ్ తల్లిదండ్రులు మేకల వెంకటేశ్వర్లు, అరుణ పిసిసి డెలిగేట్ చింతకుంట్ల.లక్ష్మీనారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు