కమ్యూనిస్టులే తెలంగాణ సాయుధ పోరాట వారసులు

Uncategorized నల్లగొండ మోతే రాజాకియం సూర్యాపేట

కమ్యూనిస్టులే తెలంగాణ సాయుధ పోరాట వారసులు

బీజేపీకి అనువంత సంబందం లేదు

 మతోన్మాదులకు మాట్లాడే హక్కు లేదు

 సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

మీ ::న్యూస్ ప్రతినిధి 

మోతే :భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ నుండి విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు సాగించాలని, మతోన్మాదం, కార్పొరేట్ సంస్థల కలిసి ప్రజలపై చేసిస్తున్న దాడులను ఎదుర్కోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు.బుధవారం మోతే మండలం రాఘవాపురం గ్రామంలో కీర్తిశేషులు కోరిపెల్లి లింగయ్య (డీలర్) జ్ఞాపకార్థం ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శౌర్య యాత్రలో భాగంగా నిర్వహించిన వీర తెలంగాణ వీధి నాటక ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ ఆనాడు దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని బిజెపి ముస్లింలకు, హిందువులకు మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరించి చరిత్రకు వక్ర భాష్యాలు చెప్తున్నదని అన్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు తిప్పి కొట్టాలని కోరారు. తెలంగాణలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాగిన మహోన్నతమైన పోరాటంలో దొడ్డి కొమురయ్య, షేక్ బందగి, ఠాన్ నాయక్, షోయబుల్లాఖాన్ లాంటి ఎందరో వీరులు అశువులుబాసారని అన్నారు.వీళ్లంతా కుల, మతాలతో సంబంధం లేకుండా భూస్వాముల అణిచివేతకు, దోపిడీకి, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన వారిలో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డితో పాటు మగ్దూం మొహియుద్దీన్ ఉన్న విషయాన్ని మర్చిపోకూడదని అన్నారు. అలాంటప్పుడు హిందూ, ముస్లింల మధ్య పోరాటం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ‌ తెలంగాణ రైతాంగ పోరాటంలో సోయబుల్లాఖాన్, షేక్ బందగి, మగ్దూం మోహినుద్దీన్, జవ్వాద్ రజ్వీ, ఆలం ఖుందుమీరి, షౌకత్ ఉస్మాని తదితర ముస్లిం నాయకులు నిజాం పైన పోరాటం చేశారని గుర్తు చేశారు. ప్రజలను పట్టిపీడించింది, వెట్టిచాకిరి చేయించుకున్న వారిలో విసునూరు రాంచంద్రారెడ్డి, జన్నారం ప్రతాప రెడ్డి లాంటి హిందువులైన జమీందారులు, జాగిర్దారులు, దొరలు, దేశ్ ముఖ్ లు, భూస్వాములు, పటేల్, పట్వారిలే మెజారిటీగా ఉన్నారని, వీరి ఆగడాలకు వ్యతిరేకంగానే ప్రజలంతా కుల, మతాలకతీతంగా ఐక్యంగా సాగించిన పోరాటాన్ని మతం పేరుతో ఎలా వక్రీకరిస్తారని ఆయన విమర్శించారు. బిజెపి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మహాత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మతం రంగు పులుమితే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజలు వాస్తవ చరిత్రను తెలుసుకోవాలని అన్నారు. ప్రజల కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా బలిదానం చేసిన రైతాంగ సాయుధ పోరాట అమరుల త్యాగాలను కించపరచడమేనని అన్నారు. అమరులను ‌గుర్తు చేసుకోవడం అంటే, మతోన్మాదుల ఆగడాలకు, కార్పొరేట్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతూ అమరులు చూపిన బాటలో పయనించడమేనని, నేడు మన ముందున్న కర్తవ్యం అని అన్నారు. ఈ సందర్భంగాఅమరవీరుల కుటుంబ సభ్యులను, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, మండల కార్యదర్శి మలుకూరి గోపాల్ రెడ్డి, మండల కమిటీ సభ్యులు కిన్నెర పోతయ్య, సిపిఎం గ్రామ కార్యదర్శి బూడిద లింగయ్య, మండల కమిటీ సభ్యులుబత్తిని వెంకటేశ్వర్లు, కాంపాటి శ్రీను, రేపాల వెంకన్న, వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు జంపాల స్వరాజ్యం, ఐద్వా మోతే మండల ప్రధాన కార్యదర్శి ములుకూరి మణెమ్మ, సిపిఎం పార్టీ సూర్యాపేట పట్టణ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కోడి ఎల్లయ్యసిపిఎం పార్టీ గ్రామ నాయకులు బోర్రాజు వెంకన్న, బో ర్రాజు మల్లయ్య, సిఐటియు జిల్లా నాయకులు చిట్యాల రవిచంద్ర, ఒగ్గు సైదులు తదితరులు పాల్గొన్నారు