బీఆర్ఎస్ కార్యకర్తలకు బీమా ధీమా 

Uncategorized నల్లగొండ మోతే రాజాకియం సూర్యాపేట

బీఆర్ఎస్ కార్యకర్తలకు బీమా ధీమా 

పార్టీలో సభ్యత్వం పొంది మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును అందించిన బిఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ 

      మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 13:: బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకర్తలకు అండగా ఉంటుందని బిఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ భరోసా ఇచ్చారు. మోతే మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన మంద ఉపేందర్ బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక సభ్యత్వాన్ని పొందారు. రోడ్డు ప్రమాదంలో మంద ఉపేందర్ మృతి చెందారు. బీఆర్ఎస్ లో సభ్యత్వాన్ని పొందిన కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ బాసటగా నిలిచింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి అందిన రూ.2 లక్షల బీమా చెక్కును నామినీ భార్య ‌మంద ఉమారాణి మరియు కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్  మండల బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఉద్యమ పార్టీ నుంచి ప్రస్థానం ప్రారంభించి రాజకీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకర్తలందరికీ అండగా నిలుస్తుందని వారు భరోసా ఇచ్చారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్టం అభివృద్ధి పథంలో పయనించిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో రూ.100 చెల్లించి క్రియాశీలక సభ్యత్వం పొందిన కార్యకర్తలెవరైనా ప్రమాదవశాత్తు మృతి చెందినట్టైతే నామినికీ రూ.2 లక్షల బీమా చెక్కును బీఆర్ఎస్ పార్టీ అందజేస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు, జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి మద్ది మధుసూదన్ రెడ్డి, మండల నాయకులు మిక్కిలినేని సతీష్, నవిల రామ్ కోటీ, వెంకట్ రెడ్డి, కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్లు గుండాల గంగులు, గాంధీ, నాయకులు సత్యనారాయణ రెడ్డి, కోటిలింగం, బాబు, రామకృష్ణ, శ్రీను, గ్రామ శాఖ అధ్యక్షుడు వెంకటరెడ్డి, తదితరులు ఉన్నారు.