హుండీ దొంగ దొరికాడు

Uncategorized క్రైమ్

హుండీ దొంగ దొరికాడు

. రిమాండ్‌కు తరలింపు

. వివరాలు వెల్లడించిన కరన్ కోట్ ఎస్సై విఠల్ రెడ్డి

దీక్షతెలుగు న్యూస్, తాండూరు :
తాండూరు మండలం వీరారెడ్డిపల్లి గ్రామ సమీపంలోని వీరభద్ర స్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హుండీ దొంగతనం జరిగింది. దీంతో ఆ గ్రామస్తులు పూజారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఎస్ఐ విటల్ రెడ్డి తన బృందంతో కలిసి వీరభద్ర స్వామి హుండీ దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై విటల్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ శివారులోని వీరభద్ర స్వామి ఆలయంలో జరిగిన దొంగతనంలో ప్రధాన నిందితుడు రాథోడ్ సంతోష్ అనే వ్యక్తి తాండూర్ మండలం మిట్టబాస్పల్లి గ్రామానికి చెందిన వాడుగ గుర్తించమని చెప్పారు. హుండీ దొంగతనం చేసింది నేనే అంటూ నేరం అంగీకరించడంతో క్రైమ్ నెంబర్ 24/2024యు /ఎస్ 457,380 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.