తాండూర్ డివిజన్ అడక్ కమిటీ కోఆర్డినేటర్ ఆనంద్ బగాడే
⏩::త్వరలో 100 మందితో బిసి సేన కార్యవర్గం
⏩::మార్చ్ లో బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బర్క కృష్ణ నేతృత్వంలో సభ
⏩::జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
మీ న్యూస్ ప్రతినిధి::తాండూర్ నియోజకవర్గం లోని బిసి యువకులు బీసీ సేనలో చేరాలని బీసీ కులాలకు అండగా నిలబడాలని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి పిలుపునిచ్చారు, తాండూర్ పట్టణంలో హిమాలయా హోటల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్ కుమార్ మాట్లాడుతూ తాండూర్ నియోజకవర్గంలో బీసీ సంక్షేమ సంఘం కు అనుబంధ సంస్థ అయిన బీసీ సేన ఏర్పాటుచేసి ప్రతి గ్రామం నుండి యువకులను బీసీ సేవలో చేర్చుకొని వంద మందితో బీసీ సేన కార్యవర్గం ఏర్పాటు చేస్తామని తాండూర్ పట్టణానికి చెందిన యువకుడు ఆనంద్ బగాడే అడక్ కమిటీ కోఆర్డినేటర్ గా ఉంటారని జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అనుబంధ సంస్థగా రాష్ట్ర బీసీ సేన అధ్యక్షులుగా బర్క కృష్ణ నేతృత్వంలో తాండూర్ ప్రాంతంలో త్వరలోనే బీసీ సేన సభ ఏర్పాటు చేస్తామని అదేవిధంగా యువకులు బిసి సేనలో చేరాలని రాజ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర నాయకులు సయ్యద్ సుకుర్ బిసి యువ నాయకులు ఆనంద్ బగాడే మాట్లాడుతూ బిసి యువకులను బీసీ సేనలో చేరే విధంగా కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దేముల్ మండల్ యువజన అధ్యక్షులు నవీన్ నియోజవర్గ యువ నాయకులు రామ్ రెడ్డి పరమేష్ వెంకట్ మొగులప్ప కాంతు జగ్గు రఘు నరేష్ మధు సురేష్ నాని శేఖర్ వీరేష్ వర్ధన్ శ్రీశైలం వివేక్ సయ్యద్ లాల్ బాబాగౌడ్ రాజు రఘు గౌడ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు