మీ: న్యూస్ సూర్య పేట్ జిల్లా ఇంచార్జీ కోల రవీందర్ గౌడ్
ప్రభుత్వపాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు దాతలు అందించిన సహకారం మరువలేనిదని ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు రాంరెడ్డి అన్నారు. శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నామవరం లో ఏర్పాటు చేసిన విద్యార్థుల క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడారు. నామవరం గ్రామానికి చెందిన కీసర వినీత్ రెడ్డి జ్ఞాపకార్థం, వారి తండ్రి గారు కీసర జైపాల్ రెడ్డి గారు క్రీడా దుస్తులను విద్యార్థులకు అందించడం జరిగింది.పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు సహకారం అందించాల్సిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వారిని సంప్రదించగా వెంటనే వారి కుమారుడి జ్ఞాపకార్థం బాలురు, బాలికల ఆటలకు సంబందించిన 30వేల రూపాయల విలువ జేసిన క్రీడా దుస్తులు జెర్సీ, షాట్, టీ షర్ట్, లోయర్, ఇన్నరు దుస్తులను అందించారు.కార్యక్రమం లో గాయం రవీందర్ రెడ్డి, చెవుగోని శ్రీను, వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సురేష్, రహేలా కుమారి , సుదీర్, మురళి, కోటి,మల్లయ్య,వెంకటేశ్వర్లు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.