⏩:-మండల ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయి లో పరిశీలించాలి
⏩:-వనమహోత్సవంకి శాఖల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలి
⏩:-జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
మీ న్యూస్ ప్రతినిది మే 26:-తెలంగాణ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు శాఖల వారీగా ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తుకు
ఖచ్చితమైన సమాధానం తెలపాలని ఆదేశించారు.రాజీవ్ యువ వికాసం సూచనలు అనుసరించి జిల్లా స్థాయి కమిటీ సమావేశాలని అధికారులు నిర్వహించాలని సూచించారు.
మండలాలకి కేటాయించిన ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయి లో పరిశీలించి రోజు వారీగా, వారం వారీగా, పక్షం రోజుల వారీగా నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకి కలెక్టర్ ఆదేశించారు.
వర్ష కాలం వస్తున్నందున స్వచ్చదనం -పచ్చదనం లో భాగంగా పంచాయతీ అధికారులు అలాగే గ్రామీణ అభివృద్ధి అధికారులు సమన్వయం చేసుకుంటూ వనమహోత్సవంలో మొక్కలు నాటెందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
ప్రజావాణి కార్యక్రమంలో భూ సమస్య లకి సంబంధించి 41 ధరఖాస్తులు జిల్లా సంక్షేమ అధికారికి 5 ధరఖాస్తులు,మున్సిపల్ కమిషనర్లకి 5 దరఖాస్తులు,ఎంపిడిఓ లకి 4 మిగిలిన 24 అర్జీలు వివిధ శాఖలకి సంబంధించి వచ్చాయని మొత్తం 79 ధరఖాస్తులు వచ్చాయని ఆర్జిలను సంబంధిత అధికారులకి పరిష్కరించుట కొరకు పంపటం జరిగిందని ఈ సందర్బంగా కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమం లో డి ఆర్ డి ఓ వివి అప్పారావు,డి డబ్ల్యూ ఓ నరసింహారావు,సిపిఓ కిషన్, డి ఈ ఓ ఆశోక్,సంక్షేమ అధికారులు శంకర్, దయానంద రాణి,శ్రీనివాస్ నాయక్, జగదీశ్వర్ రెడ్డి, పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, సుపారీటిడెంట్లు శ్రీనివాసరాజు, శ్రీలత రెడ్డి, వినోద్ కుమార్,అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.