మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాపాన్ని తెలియజేసిన మండల నాయకులు
మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 27::: మోతే మండలం మోతే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణ వార్త విన్న వెంటనే ఆయన చిత్రపటానికి పూలమాలవేసి సంతాపం వ్యక్తం చేశారు సూర్యపేట జిల్లా ఏఐయుడబ్ల్యుసి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ దోసపాటి చిరంజీవి మాట్లాడుతూ ప్రధానమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి రెండుసార్లు విచ్చేశారని కొనియాడారు మచ్చలేని ప్రధానమంత్రిగా పేరు తెచ్చుకున్నారని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రధానమంత్రి కి సంతాపం వ్యక్తం చేశారు