⏩:-మా తల్లిదండ్రులు ఇచ్చిన భూమి ని తమకు దక్కేలా చేయాలి
⏩:-నాకు రక్షణ కల్పించాలి అనుకున్నరాంపల్లి ఉమ
⏩:-మా అన్న వదినలతో నాకు ప్రాణహానికి వ్యక్తం చేసిన రంపల్లి ఉమా
మీ న్యూస్ ప్రతినిధి:-సూర్యాపేట: పసుపు కుంకుమల కింద తల్లిదండ్రులు సురభి బుచ్చయ్య, లచ్చమ్మలు ఇచ్చిన భూమిని తమకు దక్కేలా అధికారులు న్యాయం చేయాలని సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన రాంపల్లి ఉమా అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నా తల్లిదండ్రులు, నా సోదరుడైన సురభి సైదులు, మా 2007 సంవత్సరం వివాహ సమయంలో పసుపు కుంకుమల కింద ఆత్మకూర్ ఎస్ మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామ రెవిన్యూ శివారు లోని సర్వే నెంబర్ 116/ఆ/2 లో 0-21గుంటలు, సర్వేనెంబర్ 119/ఇ1 లో ఎకరం ఇరవై రెండు గుంటలు మొత్తం విస్తీర్ణం రెండెకరాల మూడు గుంటల భూమి తమకు రిజిస్ట్రేషన్ చేసి పట్టా పాస్ పుస్తకం మంజూర అయిందని నాటి నుంచి నేటి వరకు అట్టి భూమిని సేద్యం చేసుకుంటూ కబ్జాలో తాము ఉన్నామని తెలిపారు. నా తండ్రి సురభి బుచ్చయ్య (లేటు) మరణించిన కొంతకాలం తర్వాత నా సోదరుడు సురభి సైదులు, వదిన ధనలక్ష్మి, తమను ఆ భూమి పైకి రానివ్వకుండా పదే పదే ఇబ్బందులు పెడుతూ భూమిని సేద్యం చేయనీయకుండా భూమి పైకి వస్తే తమ కుటుంబాన్ని చంపుతానని బెదిరిస్తున్నారని వారినుంచి తమకు ప్రాణహాని ఉందని బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమ భూమిని తమకు దక్కేలా అధికారులు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ సోదరి సురభి అంజమ్మ తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు తమకు రిజిస్ట్రేషన్ చేసిందని ఆ ఇల్లును కూడా తమకు దక్కకుండా దౌర్జన్యానికి పాల్పడుతూ బెదిరిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.