ఈద్గా మైదానంలో ప్రమాదం 

Uncategorized క్రైమ్ జహీరాబాద్ సంగారెడ్డి

ఈద్గా మైదానంలో ప్రమాదం 

 

⏩:-ఈద్గా మైదానంలో తృటిలో తప్పిన పెను ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

 

⏩:-కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

 

 మీ న్యూస్ ప్రతినిధి:-జహీరాబాద్ మే 25 : జహీరాబాద్ పట్టణంలోని ఈద్గా మైదానంలో పార్లమెంట్ అమోదించిన “వక్స్ చట్టానికి వ్యతిరేకంగా బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంగా విద్యుత్-దీపాల కమాన్ కూలిపోవడంతో కింద కూర్చున్న 8 మందిపై పడి గాయాలయ్యాయి.తీవ్రంగా గాయపడిన వారికి హైదరాబాద్ తరలించారు.విద్యుత్ సరఫరా అవడంతో వెంటనే అధికారులు విద్యుత్ సరఫరాలను నిలిపివేశారు.దీంతో పెను ప్రమాదం తప్పింది.గాయపడి చికిత్స పొందుతున్న వారిని స్థానిక సన్ రోహి ఆసుపత్రిలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి ,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి పరామర్శించారు.వారు వైద్యులతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు.వారితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్,మండల కాంగ్రెస్ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పి.నాగిరెడ్డి,సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,అక్తర్,హర్షద్ పటేల్,అక్బర్, జుబేర్,జహంగీర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.