ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

Uncategorized ఆత్మకూర్ నల్లగొండ సూర్యాపేట

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

 మీ న్యూస్ ప్రతినిధి:- 16 శుక్రవారం ఆత్మకూరు ఎస్ మండలంలోని ఏనుబాముల గ్రామంలో ఐకెపి వారు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలిసి కలెక్టర్ తేజస్ శుక్రవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో ఎనుమాముల గ్రామానికి చెందిన గుద్దేటి మల్లారెడ్డి ధాన్యాన్ని లారీలోకి ఎగుమతి జరుగుతున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేని దానివల్ల ధాన్యం తడవకుండా రైతులు టార్పాలిన్స్ రాత్రి సమయంలో ధాన్యాన్ని కప్పి పెట్టాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు. జిల్లాలో గత రబి సీజన్ కంటే ధాన్యం దిగుబడి బాగా వచ్చిందని గత రబి సీజన్ లో 23 -24 సం॥ లో నేటి వరకు 2,30, 614 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈ రబి సీజన్లో 24-25 నేటి వరకు 2,49, 670 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం చివ్వెంల మండలంలోని బీబిగూడెంలో గల శ్రీ శివదుర్గ రైస్ ఇండస్ట్రీస్ లో జరుగుతున్న దాన్యం దిగుమతులను కలెక్టర్ పరిశీలించారు ,రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హమాలీలను ఎక్కువ పెట్టుకుని దిగుమతి త్వరగా అయ్యేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. రైతులు అధైర్యపడవద్దని ప్రతి గింజను కొనుగోలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎం సివిల్ సప్లై ప్రసాద్ ఐకెపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.