మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి పర్మినెంట్ చేయాలని సిఐటియు డిమండ్
మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 27 :::: తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు తాండూర్ మండల ఎంపీడీవో కార్యాలయం దగ్గర మండల కేంద్రంలో ఈరోజు రేపు టోకెన్ సమ్మె సందర్భంగా హాజరైన *సి టి యు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ* భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోయిన వారికి పూలమాలవేసి నివాళులర్పిచ్చి సంతాపం ప్రకటించడం జరిగినది మన్మోహన్ సింగ్ గారు ఆర్థికవేత్తగా అనేక సంస్కరణ చేయుటలో గొప్ప మేధావి ఆయన చనిపోవడం ఈరోజు చాలా బాధాకరమని తెలిపారు
మరియు ఈరోజు టోకెన్ సమ్మె సందర్భంగా గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు దాదాపు 6 నుండి 10 నెలల వరకు పెండింగ్ వేతనాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వానికి అనేకమార్లు విన్నవించిన వేతనాలు చెల్లింపులు జరపలేదని కుటుంబ పోషణ భారం అవుతుందని తెలిపారు మల్టీపర్పస్ వర్కర్ విధానాల వలన రాష్ట్రంలో 100కు పైబడి కార్మికులు ట్రాక్టర్ నడుపుతూ కరెంటు సరఫరా లో పనులు చేస్తూ చనిపోయారని వారి కుటుంబాలు వీధిన పడ్డాయని ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా నోచుకోని పరిస్థితి ఉందని పంచాయతీ కమిషనర్ మరియు ప్రిన్సిపల్ సెక్రెటరీ మరియు పంచాయతీరాజ్ శాఖ మాత్యులు దనసరి అనసూయ సీతక్క గారికి పలుమార్లు విన్నవించినప్పటికీ పెడచెవిన పెట్టారు తప్ప ఇప్పటికీ వేతనాలు చెల్లింపులు లేవని మాది ప్రజా పాలన ప్రభుత్వమని ప్రజలకు అనేక విధాలుగా సేవ చేస్తున్న కరోనా డెంగ్యూ మలేరియా పారిశుద్ధ్యం కరెంట్ సరఫరా అనేక విభాగాల్లో అత్యవసర పనులు చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులు ఎక్కువ శాతం దళిత గిరిజనులైనప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేయడం లేదని వేతనాలు లేక కుటుంబాలు వీధిన పడ్డాయని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని వేతనాలకు ప్రభుత్వమే గ్రాంట్ ద్వారా నిధులు వెచ్చించాలని జీవో నెంబర్ 51 సవరించాలని మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని పర్మినెంట్ చేయాలని పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం 10 లక్షలు అమలు చేయాలని కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించాలని కోరుతూ ఈరోజు విధులను బహిష్కరిస్తూ టోకెన్ సమ్మె నిర్వహించడం జరిగినది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జేఏసీతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని లేనియెడల నూతన సంవత్సరం 2025లో మొదటి వారంలోనే నిరవధిక సమ్మెకు వెళ్తామని తక్షణమే సమస్యలు పరిష్కరించాలని కోరారు
కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికుల యూనియన్ నాయకులు నర్సిములు అంబరప్ప మల్లేష్ షబ్బీర్ హరిఫ్ శివరాం రవి కిష్టప్ప నర్సింలు చందు లక్ష్మి వీరప్ప వెంకటప్ప పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు