మీ న్యూస్ ప్రతినిధి::మహిళలకు రక్షణ కల్పించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా అని, మహిళల హక్కుల సాధన కోసం ఉద్యమాలు ఉదృతం చేస్తామని NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య, NPRD మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ సాయమ్మ అన్నారు. ఈ రోజు పరిగి పట్టణంలోని TTD కల్యాణ మండపం ఆవరణలో మహిళా వికలాంగుల జిల్లా సదస్సు జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మహిళలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో సమాన భాగస్వామ్యం కల్పించాలనే లక్ష్యంతో మార్చి 8ని ఐక్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవన్ని అధికారికంగా జరుపుతున్నారని అన్నారు.కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారలు పెరిగిపోతున్నాయని అన్నారు.10ఏండ్ల బీజేపీ పాలనలో మహిళలపై 28 శాతం నేరాలు పెరిగాయాని అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల నిర్లక్ష్యం వలన 75మంది శిక్షల నుండి తప్పించుకుంటున్నారని అన్నారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ లేదని అన్నారు.మహిళల రక్షణ కోసం రాజ్యాంగంలో ఉన్నా అంశాలు అమలుకు నోచుకోవడం లేదని అన్నారు.మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్స్ అమలు చేస్తమని చట్టం చేసిన కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి మీనవేశాలు లెక్కిస్తుందని అన్నారు.మహిళాల హక్కుల సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు.
NPRD జిల్లా అధ్యక్షులు జె దశరథ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 4లక్షల మంది మహిళా వికలాంగులున్నారని అన్నారు.ఐక్య రాజ్యా సమితి హక్కుల ఒప్పంద పత్రంలో ఆర్టికల్ 3,6లలో మహిళా వికలాంగుల హక్కులు పొందుపార్చిన అమలుకు నోచుకోవడం లేదన్నారు. మహిళా వికలాంగుల్లో వివాహం కానీ వారి సంఖ్య సాధారణ మహిళలతో పోల్చితే 4రేట్లు అధికంగా ఉందని అన్నారు.70శాతం మంది మానసిక వికలాంగులు లైంగిక దూరక్రమణకు గురవుతున్నారని అన్నారు.గృహ హింస చట్టంలోని సెక్షన్ 3(బి )(డి )మహిళా వికలాంగులు వినియోగించుకోవడం లేదన్నరు. మహిళా వికలాంగుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కె. సావిత్రమ్మ, కో కన్వీనర్ సత్యమ్మ , మీడియా కన్వినర్ జి. రాజు , పరిగి మండల అధ్యక్షులు నర్సింలు, కుల్కచర్ల మండల్ అధ్యక్షులు నందు, NPRD సభ్యులు అనంత లక్ష్మి, పాకిరమ్మ, యశోద, నందిని, మరియు ఇతర మహిళా సభ్యులు పాల్గొన్నారు