షరతులు లేకుండా రాజీవ్ యువ వికాస్ సబ్సిడీ రుణాలు ఇవ్వాలి

Uncategorized తాండూర్ రాజాకియం వికారాబాద్

షరతులు లేకుండా రాజీవ్ యువ వికాస్ సబ్సిడీ రుణాలు ఇవ్వాలి

⏩:-దరఖాస్తు చేసుకున్న ప్రతి నిరుద్యోగ యువతకు రుణాలు మంజూరు చేయాలి

⏩:-రుణాల మంజూరులో బ్యాంకుల జోక్యం లేకుండా చూడాలి

⏩:-రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు మంజూరు చేయాలి

⏩:-జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్

మీ న్యూస్ ప్రతినిధి:రాజీవ్ యువ వికాసం కింద దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మంజూరు చేయాలని జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ ఒక ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు రాజీవ్ యువ వికాసం పథకానికి 16 లక్షల 25,441 తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు నాలుగు కేటగిరీల్లో దరఖాస్తు చేసుకున్నారని,దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 6000 కోట్ల ను ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి కేటాయిస్తామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారని మార్చి 17 నుండి ఏప్రిల్ 14 వరకు రాష్ట్రంలో నిరుద్యోగులు 50వేల రుణాల కొరకు క్యాటగిరి వన్ కింద 39,401 క్యాటగిరి 2లో ఒక్క లక్ష రుణాల కొరకు 93 వేల 23,క్యాటగిరి 3 కింద రెండు లక్షల రుణాల వరకు రెండు లక్షల 49 వేల 434 మంది నిరుద్యోగులు క్యాటగిరి 4 లో నాలుగు లక్షల రుణాల 12 లక్షల 41 వేల 696 మంది దరఖాస్తు దరఖాస్తుదారులు రుణాల కోసం అప్లై చేశారని వారందరికీ బ్యాంకులకు సంబంధం లేకుండా స్థానిక రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అప్లై చేసిన ప్రతి ఒక్క దరఖాస్తుదారునికి రుణాలు మంజూరు చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ యువతకు రుణాలు మంజూరు చేయాలని కోరారు రుణాలు సెలక్షన్స్ ప్రాసెస్ లో బ్యాంకుల జోక్యం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు నిరుద్యోగ యువతకు రుణాల మంజూరులో గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని కావున కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు రుణాలు మంజూరు చేయాలని కోరారు