ఘనంగా చైతన్య భారతి హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళ

Uncategorized పూర్వ విద్యార్థుల సమ్మేళనంపూర్వ విద్యార్థుల సమ్మేళనం సూర్యాపేట

ఘనంగా చైతన్య భారతి హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

 

మీన్యూస్ ప్రతినిధి::సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని చైతన్య భారతి హైస్కూల్ కు చెందిన 1997-98 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం త్రిబుల్ ఆర్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఇరవై ఏడేళ్ల తర్వాత కలుసుకున్న నాటి విద్యార్థులంతా ఒకచోట చేరి వారి జ్ఞాపకాలను పంచుకున్నారు.నేటి తమ స్థితిగతులను ఒకరినొకరు అడిగి తెలుసుకుని ఆనందంగా గడిపారు.ఎన్నో సంవత్సరాల తర్వాత తామందరం ఒకచోట కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు.అనంతరం తమకు విద్యాబుద్దులు నేర్పి నేడు సమాజంలో ఉన్నతంగా ఎదిగేలా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నాటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుండే క్రమశిక్షణ, మానవత విలువలు, పెద్దల యందు గౌరవం వంటి విషయాలను నేర్పాలని అన్నారు.విద్యార్థులంతా వివిధ రంగాలలో ఉన్నత స్థితిలో ఉండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం సుధాకర్ రెడ్డి,నాటి ఉపాధ్యాయులు డి.శ్రీనివాసరావు, శేఖర్,జమాలుద్దిన్, గుండా వెంకటేశ్వర్లు ఇక్బాల్,ఆనంద, అమీనా, పూర్వ విద్యార్థులు కిరణ్మయి, గజ్జల నరేష్, శ్వేత,రాధ,జ్యోతి,సుమ,రమాదేవి, క్రాంతి,నాగ లక్ష్మీ,ప్రశాంత్,దివ్య,ఉష,సతీష్, విజయ్,రమేష్ , ప్రణీత,శంషద్,రవి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.