సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం

Uncategorized సూర్యాపేట
  1. ,
  2. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640659560 మార్చి 27

2007 లో అప్పటి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను, రోడ్లతో సహా 350 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని, ఆందోళనలో పాల్గొన్న సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ని అక్రమ అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని వాణిజ్య భవన్ సిపిఎం సీనియర్ నాయకులు బొమ్మిడి లక్ష్మినారాయణ తెలిపారు. గురువారం వాణిజ్య భవన్ సెంటర్ లో రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టుకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పటి ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఇండ్లు నిర్మించుకోవడానికి వెళ్ళిన పేదలను, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో పాటు, జిల్లా నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

రామోజీ ఫిలింసిటీ వద్ద నాగన్‌పల్లి, పోల్కంపల్లి గ్రామాలకు చెందిన దాదాపు 700 మంది పేదలకు ఒక్కొక్కరికి 60 గజాల చొప్పున 2007 సంవత్సరంలో ప్రభుత్వం పట్టాలిచ్చిందని అన్నారు. కానీ ఆ భూమి మీదకు ప్రజలు వెళ్లి నివాసం ఏర్పాటు చేసుకోకుండా రామోజీ సంస్థ దారిని ఆక్రమించి, చుట్టూ గోడ నిర్మించి సెక్యూరిటీని పెట్టి అడ్డుకుంటున్నదని ఆరోపించారు.స్థలాలలోకి వెళ్ళిన 75 మంది పేదలపై గతంలో అక్రమ కేసులు పెట్టి సంవత్సరాల తరబడి కోర్టులు చుట్టూ తిప్పిందని అన్నారు . జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ యంత్రాంగం, స్థానిక ఎంఎల్‌ఏ జోక్యం చేసుకుని దీనిని పరిష్కరించకుండా జాప్యం చేస్తూ, రామోజీ సంస్థకే అనుకూలంగా వ్యవహరిస్తున్నరని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో 400 మంది లబ్దిదారులను వారికి ఇచ్చిన స్థలాల వద్దకు తీసుకెళ్లడంతో పోలీసులు నాయకులపై, పేదలపై కర్కశంగా ప్రవర్తించి అరెస్టులు చేసిందనీ, అరెస్టు చేసిన వారిని తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చిత్రం భద్రమ్మ, గోగుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.