Uncategorized

అంబేడ్కర్‌ ఆశయాలకనుగుణంగా నడవాలి
-ఘనంగా జీవన్గిలో అంబేద్కర్133వ జయంతి వేడుకలు
-అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించిన నాయకులు
-జై భీమ్.. జై భీమ్ అంటూ.. ఆ ప్రాంతం మార్మోగింది..

దీక్షతెలుగున్యూస్, తాండూరు :

అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని, ఆయన సూచించిన మార్గంలో పయనించి నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జీవన్గి నాయకులు, యువకులు సూచించారు. ఆదివారం భారతరత్న అంబేడ్కర్‌ 133వ జయంతి వేడుకలను బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో ఘనంగా నిర్వహించారు.పి.శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఎంపీ డాక్టర్ చంద్రశేఖర్, రిపోర్టర్ నర్సిములు,వై.అంజిలప్ప, పి.భీమప్ప,పి.నర్సిములు ,శంకు, సంగారెడ్డి,పి.వెంకటప్ప, ఎండి కాజా మియా, పి.వీరేశం,ఆర్.బుజ్జప్ప,ఆర్ఎంపిడాక్టర్రాజు,పి.నరేష్,వై.రాజు,ఆర్.రవి,వై.జీవన్,వై.మధు,వై.లక్ష్మణ్, ఎండి మోయిజ్, ఇతరులతో కలిసి పూల మూలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ

సందర్భంగావారుమాట్లాడుతూ..సమాజాభివృద్ధి కోసం కొంత మంది నేతలు సూచనలు మాత్రం చేస్తారని, అంబేడ్కర్‌ అలా కాకుండా ఆచరణలో చూపిన మహనీయులు అని కొనియాడారు. దేశంలో ఉన్నత విద్యావంతుడిగా ఉన్న అతికొద్ది మంది వ్యక్తుల్లో అంబేడ్కర్‌ ఒకరని తెలిపారు. బరోడాలో జరిగిన చేదు అనుభవం తరువాత స్వతంత్ర వ్యక్తిత్వం కలిగి జీవించిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచారని తెలిపారు. అటువంటి గొప్ప వ్యక్తి ఒక వర్గానికి, కులానికి పరిమితం చేసే పరిస్థితులు ప్రస్తుతం ఉండటం దురదృష్టకరమన్నారు. కేవలం చదువు ద్వారానే ప్రపంచవ్యాప్తంగా అంబేడ్కర్‌కు ప్రత్యేక గుర్తింపు లభించిందనేది వాస్తవమన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించాలని, కేవలం చదువు మాత్రమే కాకుండా సామాజిక అంశాలపై పట్టు సాధించాలని, తద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని యువకులు ఈ దిశగా ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు, పలు పార్టీ నాయకులు, చిన్నారులు, ఇతరులు పాల్గొన్నారు.