మీ న్యూస్ మార్చి 12::రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు, న్యాయవాది , నల్గొండ జిల్లా క్రైస్తవ సంఘం గౌరవ సలహాదారులు నంద్యాల దయాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 4 వార్డ్ రామకోటి తండా చార్లెట్ అనాధ పిల్లల ఆశ్రమము నందు క్రైస్తవ రాష్ట్ర నాయకులు బేతేస్తా మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ హెప్సిబా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆశ్రమంలో ఉన్న అనాధ పిల్లలకు పండ్లు పంపిణీ చేసి,వారి కొరకు సూర్యాపేట నియోజకవర్గ ఫాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు డాక్టర్ జలగం జేమ్స్, సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు బ్రదర్ జాటోత్ డేవిడ్ రాజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ కార్యక్రమం లో గౌరవ సలహాదారులు రెవ. బొక్క ఏలీయా రాజు, పెన్ పహాడ్ మండల అధ్యక్షులు రెవ. డా.డి. జాన్ ప్రకాష్, సూర్యాపేట రూరల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెవ ఏర్పుల క్రిస్టోఫర్, పాస్టర్ రెడ్డి పల్లి ప్రేమ్ సాగర్, నకిరేకంటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.