రావిపహాడ్‌లో ఎండిన పొలాలను పరిశీలించిన రైతు సంఘం నేతలు 

Uncategorized రాజాకియం వ్యవసాయం సూర్యాపేట

రావిపహాడ్‌లో ఎండిన పొలాలను పరిశీలించిన రైతు సంఘం నేతలు 

 

మీ న్యూస్ మర్చి12::మోతే మండలం రావిపహాడ్ గ్రామంలో ఎండిన పొలాలను రైతు సంఘం జిల్లా కార్యదర్శి దండ వెంకటరెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సారెస్పీ (శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్) కాలువ ద్వారా నీరు రాకపోవడం వల్ల వరి పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయని, ఎండిన పొలాలను రైతులు పశువులకు మేతగా పొలాల్లోనే మేపుతున్న పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.ఇది ఇలా ఉంటే . మిర్చి పంట కూడా పూర్తిగా దెబ్బతిని, కాపు రాని స్థితిలో ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు ఎకరానికి ₹30,000 నష్టపరిహారం మిర్చి క్వింటా కు 25000/- రూపాయలు అందించాలి” అని ఆయన డిమాండ్ చేశారు.రైతుల కష్టాలను ప్రభుత్వం గమనించి అత్యవసర చర్యలు తీసుకోవాలని, లేకుంటే రైతు సంఘం మరింత ఉధృతంగా ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కాంపాటి శ్రీను, సోమ గాని మల్లయ్య, బత్తిని వెంకటేశ్వర్లు, డివైఎఫ్ఐ నాయకులు ఎలుగు మధు చేగువేరా,గ్రామ శాఖ కార్యదర్శి ఎర్రబోయిన మల్సూరు, రైతు సంఘం గ్రామ కార్యదర్శి దాసరి వెంకన్న, రైతులు కోట శేఖర్ రెడ్డి , రమేష్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.