ఘనంగా మహాశివరాత్రి

Uncategorized కోదాడ మోతే సూర్యాపేట

ఘనంగా మహాశివరాత్రి

 

 

మీ న్యూస్ ప్రతినిధి::మోతె: మండల పరిధిలోని కుడలి గ్రామంలోని శ్రీ కూడలి సంగమేశ్వర ఆలయంలో బుధవారం మహాశివరాత్రి పర్వదినాన సందర్భంగా కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి,ఆలయ ధర్మకర్త కక్కునూరు రోహిత్ ,అర్చకులు హరి ప్రసాద్ ప్రత్యేక అభిషేకం, ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఉత్తమ్ పద్మావతి యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు తోగాటి వేలాద్రి 25వేల రూపాయలు, గ్రామ దాతల సహకారంతో మహాశివరాత్రి పర్వదినాన మహానదానాన మహా అన్నదానాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ కూడలి సంగమేశ్వర స్వామి కరుణ కటాక్షాల తో ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి పందిళ్ళపల్లి పుల్లారావు,మాజీ సర్పంచ్ మామిడి అనిత వెంకటేశ్వర్లు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్ రెడ్డి సూర్యాపేట జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గునగంటి నాగరాజు గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకృష్ణ, మండల సోషల్ మీడియా అధ్యక్షుడు అర్వపల్లి గణేష్, వివిధ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, వీర నాయక్, వివిధ గ్రామాల నుంచి భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు తదితరులు పాల్గొన్నారు.