schedule Friday, September 11, 2026

అజ్మీర్ షరీఫ్ దర్గాలో జన్మదిన వేడుకలు

calendar_today August 5, 2026
person meenewstelugu
అజ్మీర్ షరీఫ్ దర్గాలో జన్మదిన వేడుకలు
    ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు   4వ వార్డ్ కాంగ్రెస్ నాయకులు షేక్ వసీం   తాండూర్ ఎమ్మెల్యే గుయ్యని మన రెడ్డి జన్మదిన సందర్భంగా పూల చాదర్ సమర్పించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తాండూరు పట్టణం ఇంద్రానగర్ కు చెందిన నాలుగువ వార్డ్ కాంగ్రెస్ నాయకులు షేక్ వసీం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని అజ్మీర్ షరీఫ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాలో పూల చాదర్ సమర్పించి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆయు రారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని, ప్రత్యేక దువాలు చేశారు. అనంతరం భక్తులకు, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి, మానవ సేవే మాధవ సేవ అనే భావనతో సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని, ఆయన నాయకత్వంలో తాండూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రార్థించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి పుట్టిన రోజులు ఆయన మరెన్నో ఆరోగ్యంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో దర్గా నిర్వాహకులు, భక్తులు, స్థానికులు పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేశారు.