⏩::కెవిపిఎస్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కన్న
⏩::వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గప్ప
మీ న్యూస్ ప్రతినిధి::యలాల్:భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని అణిచివేత ఆధిపత్యం పై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఏప్రిల్ 30న ఉదయం 10 గంటలకు తాండూర్ పట్టణం లో జరుగు పూలే,అంబేద్కర్ జన జాతర సభ ను నిర్వహించటంతో పాటు కుల వివక్ష పై ప్రత్యక్ష ప్రతిఘటన ఉద్యమాలు చేపట్టాలని కెవిపిఎస్ పిలుపు నిచ్చింది ఈ రోజు యాలాల మండల కేంద్రంలో కేంద్రంలో KVPS ( కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం) ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలే అంబేద్కర్ జన జాతర సభ విజయవంతం చేయాలని కరపత్రం విడుదల చేయడం జరిగింది.ఈ సందర్బంగా కేవీపీస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి.మల్కన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గప్ప మాట్లాడుతూ కులవివక్ష ఆదిపత్యానికి వ్యతిరేకంగా కెవిపిఎస్ గత కొన్ని సంవత్సరాలుగా పూలే అంబేద్కర్ జన జాతర సభలు నిర్వహిస్తుందన్నారు.మను ధర్మశాస్త్రం పేరుతో వేల సంవత్సరాలుగా దేశంలో మెజారిటీ ప్రజలను అణిచివేశారని చెప్పారు.నేడు ఆ భావజాలంతో దేశాన్ని ఏలుతున్న మనువాద పాలకులు వారి విధానాలు హిందూ మతంలోని మెజారిటీ ప్రజలను అణిచివేయటానికి అవమానించటానికి ఉపయోగపడుతున్నాయన్నారు ధరలు పెంచడం నిరుద్యోగాన్ని పెంచడం ఆర్థిక అసమానతలు పెంచడం వంటి దుష్ట విధానాలను ప్రజలకు అర్థం కాకుండా నిత్యం మతం మత్తులో ముంచుతుందనివారు. విమర్శించారు.దేశవ్యాప్తంగా లక్షలాది బ్యాక్ లాక్ పోస్టులు భర్తీ చేయకుండా దళిత గిరిజనుల ఉపాధి ఎలామెరుగుపడుతుందన్నారుదేశంలో దళితులపై 300 రెట్లు దౌర్జన్యాలు పెరిగాయన్నారు.రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన నేతలు వారి మనువాద దుష్ట విధానాలతో దేశాన్ని పరిపాలిస్తు రాజ్యాంగాన్ని తొలగించాలని చూస్తున్నారని విమర్శించారు పూలే అంబేద్కర్ ఆశయాలకు తిలోదకాలు ఇస్తూ దేశంలో క్యాపిటలిస్టుల ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారని అన్నారు.జ్యోతిబాపూలే అంబేద్కర్ ఆశయాలను నేటి తరంలోకి విస్తృతంగా తీసుకెళ్లే క్రమంలో రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను ప్రభుత్వ రంగ సంస్థలను సామాజిక న్యాయాన్ని సాధించడానికి పూలే అంబేద్కర్ జన జాతర సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు, రాష్ట్రంలో కులవివక్ష అంటరానితనం ఎక్కడ ఉన్న ప్రతిఘటించి పోరాడుదామని అన్నారు.ప్రజలు పౌర సమాజం కుల వివక్షను పారద్రోలాలని జిల్లాలో కులవివక్షపై ప్రత్యక్షంగా ప్రతిఘటన చేపడుతామని చెప్పారు.అభ్యుదయవాదులు,సామజిక ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు.కళాకారులచే అట పాట మాట కార్యక్రమాలు,డప్పు లు కోలాటం ఇతర సంస్కృత కార్యక్రమంలు వుంటాయని అన్నారు.పెద్ద ఎత్తున ప్రజలు పుర ప్రముఖులు కవులు కళాకారులూ మేధావులు మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఏఎంసీ డైరెక్టర్,ముదిరాజ్ సంఘం మండల నాయకులు గోనెగారి చిన్న,కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రాపోల్ నాగయ్య,నాయకులు దూస శేఖర్ బిఆర్ఎస్ నాయకులు మలిగేరి నర్సిములు,బీసీ సంఘం నాయకులు బోయిని ఉమేష్,మ్యాదరి బాలప్ప,బాయిమిది.కృష్ణ గీత కార్మిక సంఘం నాయకులు,అచ్యుతపూర్ కిష్టప్ప గౌడ్,గడ్డం పెద్ద నర్సిములు గౌడ్,గడ్డం రాములు గౌడ్, మంగలి యాదయ్య,మైనార్టీ సంఘం నాయకులు,రఫిక్ రజాక్,సలీం పాషా,KVPS నాయకులు జోగు రమేష్,నక్కల మహేష్ తదితరులు పాల్గొన్నారు