–రాత్రి వేళల్లో,తాగుకుంటూ పేకాట ఆడుకుంటూ ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు
–మండపం రోడ్ కి అడ్డంగా పెట్టి ప్రయాణికులకు ఇబ్బంది
అడ్డగూడూరు ప్రతినిధి శివ నవీన్: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధలోని వివిధ గ్రామాలు గణేష్ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఉత్సవ కమిటీ సభ్యులకు పోలీస్ వారి విన్నపం ప్రతి విగ్రహనికి పోలీస్ వారి నుండి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకొని ఉండాలి..మండపం రోడ్ కి అడ్డంగా పెట్టి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించొద్దు. మండపానికి కరెంట్ మరియు ల్యాండ్ ఓనర్ అనుమతులు ఉండాలి..మండపం వద్ద షాట్ సార్క్యూట్ కాకుండా చూసుకోవాలి,అతుకులు ఉండి,ఇన్సూలేషన్ కట్ అయి ఉన్న కరెంటు వైర్లు ఉపయోగించకూడదు.మండపం వద్ద నీళ్ల డ్రమ్ము నిండా నీరు మరియు సంచులలో ఇసుక నింపి పెట్టాలి.మండపం వద్ద స్పీకర్లు ఉదయం 05.30 గంటల నుండి రాత్రి 10.00 గంటల వరకు మాత్రమే పెట్టాలి,మరియు సౌండ్ తక్కువగా పెట్టాలి.సౌండ్ ఇతరులు తిట్టుకునే విదంగా ఉండకూడదు.పండగ వల్ల మీ ఇళ్లల్లో సంతోషం ఉండాలి,కానీ విషాదం ఏర్పడే విదంగా ఉండరాదు.పండగ అంటే సంతోషం కదా అని ఇతరులను ఇబ్బంది పెట్టి మీరు సంతోష పాడరాదు.ప్రతి మండపం వద్ద రాత్రి పగలు కాపలా ఉండేలా నిర్వాహకులు చూసుకోవాలి,అలా వీలు అయితేనే విగ్రహాలు పెట్టండి.మద్యం సేవించి మండపం లొ ఉండకూడదు, రాత్రి వేళల్లో,తాగుకుంటూ మరియు పేకాట ఆడుకుంటూ ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడును.మండపం వద్ద ఏదైనా సంఘటన జరిగినట్లయితే సంబంధిత శాఖలకు సమాచారం అందించాలి.పండగ రోజుల్లో తాగి గొడవలు పడకూడదు, అలా గొడవల వల్ల మీ కుంటుంబం ఇబ్బందుల పాలు అవుతుంది.ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించిన ప్రసంగాలు చేసిన కానీ,రాజకీయ పాటలు పెట్టినా కానీ అట్టి మండపం నిర్వాహకులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడును.నిమజ్జనం రోజు రాత్రి వరకు ఉండకుండా తొందరగా తగు జాగ్రత్తలు తీసుకొని నిమజ్జనం చేయాలి.డిజె లు పెట్టినట్లయితే అట్టి డిజెలను సీజ్ చేసి కేసు నమోదు చేయబడునన్ని అడ్డగూడూర్ ఎస్ఐ నాగరాజు తెలిపారు.