–వినాయక ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి.
—ఐక్యమత్యంతో నే పండుగ వాతావరణం.
—ప్రేండ్లీ పోలిసు తరహాలో సహాకరించాలే
–జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి
–డిఎస్పీ బాలకృష్ణా రెడ్డి
తాండూరు (మీన్యూస్ ప్రతినిధి )
వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి పేర్కొన్నారు.బుధవారం తాండూరు పట్టణంలో ని దుర్గా గార్డెన్స్ లో డిఎస్పీ బాలకృష్ణా రెడ్డి ఆద్వర్యంలో పట్టణ సిఐ జీ.సంతోష్ కుమార్ సమక్షంలో రాబోయే వినాయ ఉత్సవాల సందర్భంగా శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ సమస్యలు ఎదైనా ఎదురుకోనే స్థాయి తాండూరు నాయకులకు ఉందన్నారు. పవిత్రమైన పండుగను భక్తి శద్దలతో జరుపు కోవాలన్నారు. అవగహన లెని వ్యక్తులు మాత్రమే లేని పోని అపోహలు సృష్టించబడతా యన్నారు. అలాంటి వారిపై తగు చర్యలు తీసుకుంటామని అన్నారు.శాంతి సమావేశం ఐక్యమత్యంతో పండుగలను జరుపుకు ఉద్దేశ్యం అన్నారు. శాంతి భద్రతల తోనే అబివృద్ది సాద్యమన్నారు.
మాట్లాడుతూ….ఎక్కడైతే శాంతి భద్రతలు ఉంటాయో అక్కడా అబివృద్ది ఉంటుందన్నారు.శాంతి యుతంగా స్నేహపూరిత వాతావరణంలో పండగలు జరుపుకోవాలన్నారు. ఒకరిని ఓకరు గౌరవించుకోవాలిని అప్పుడే శాంతి యుత వాతవారణం నెలకొంటుందన్నారు.
మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
మాట్లాడుతూనియోజకవర్గంలో ఉన్న ప్రతిఓక్కరు కలిసి మేలసి ఉన్నారని తెలిపారు. సోదరభావం కలిగి ఉన్నామన్నారు.హిందూ ముస్లింలు కలిసి మేలసి పండుగలు జరుపుకుంటారని తెలిపారు.మండప నిర్వాహకులు మరియు నాయకులు కలిసి ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించాలని కోరారు.వినాయ ఉత్సవాలకు విద్యుత్ అంతరాయం కాకుండా జగ్రత వహించాలని విద్యుత్ అధికారులకు సూచించారు.ఎలాంటి ఇబ్బందులు లెకుండా చూడాలన్నారు. పోలీస్ శాఖ వారికి
ప్రేండ్లీ పోలిసు తరహాలో సహాకరించాలని కోరారు.
రాజుగౌడ్ మాట్లాడుతూ….ఐక్యమత్యంతో కలిసి మేలసి పండుగలు ప్రశాంతంగా జరుపుకునేందు ప్రతిఓక్కరు సహాకరించాలన్నారు. సోషల్ మీడియాలో లేని పోని అపోహలు నమ్మవద్దన్నారు. అనంతరం హిందూ ఉత్సవకమటి అద్వర్యం లో ఎస్పీ, డిఎస్పీ, సిఐల తోపాటు ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ,రాజుగౌడ్ ,సాయిపూర్ నర్సింలు,మున్సిపల్ కమిషనర్ విక్రం సింహారెడ్డి ,కౌన్సిలర్లు నిరాజ బాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ,మనపూరం రాము, విద్యుత్ ఎడి హాదినారాయణ ,యంఆర్ఓ తారాసింగ్ ,ముస్లిం వెల్పేర్ అసోసియేషన్ అద్యక్షులు కమలక్తర్ ,హిందూ ఉత్సవ కమిటీ అద్యక్ష కార్యదర్శులు, రూరల్ సిఐ ఆశోక్ కుమార్ ,ఎస్ఐలు విఠల్ రెడ్డి, శివశంకర్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.