ఊర్లుగొండ లో పోలీసు ప్రజా భరోసా
సామాజిక అంశాలపై గ్రామ ప్రజలకు అవగాహన
పాల్గొన్న మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ డి రామకృష్ణ రెడ్డి, మోతే ఎస్సై అజయ్ కుమార్ పోలీసులు
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు
మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ఇంచార్జి:::ఊర్లుగొండ గ్రామంలో మోతే పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నిర్వహించిన పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ డి రామకృష్ణ రెడ్డి, మోతే ఎస్సై అజయ్ కుమార్ పోలీసు సిబ్బంది హాజరై మాట్లాడారు సామాజిక అంశాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు, ఈ కార్యక్రమం నందు ప్రజలకు చట్టాల అమలు, జైలు శిక్షలు, వ్యక్తుల సత్ప్రవర్తన అంశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా మునగాల డి రామకృష్ణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో జిల్లా పోలీస్ శాఖ నిర్వహిస్తున్న ప్రజా భరోసా కార్యక్రమాల సందర్భంగా ఈ గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి వచ్చామని, రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పిస్తూ, ప్రజలందరూ కలిసి మెలిసి ఉండాలని, క్షణికావేశంతో స్వార్థంతో అత్యాశతో ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని నేరాలకు పాల్పడవద్దని కోరారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా గ్రామంలో నిఘా ఉంచాం అన్నారు. గ్రామం శాంతియుతంగా ఉంటే గ్రామ అభివృద్ధి జరుగుతుందని యువత భవిష్యత్తులో సన్మార్గంలో నడుస్తారని అన్నారు. సైబర్ మోసాలు రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు. మహిళలను గౌరవించాలని మహిళల పట్ల దాడులకు పాల్పడకూడదని కోరారు. నేరాలకు పాల్పడం వల్ల జీవితం జైలు పాలవుతుందని చట్టాలు బలోపేతంగా ఉన్నాయని ప్రతి ఒక్కరు సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.