జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ బృందం తనిఖీ
– రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశం
మీ న్యూస్ జహీరాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 10: జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ యూనూస్ స్థానిక కౌన్సిలర్లతో కలిసి శుక్రవారం సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలను ఆయన స్వయంగా పరిశీలించారు. చైర్మన్, కౌన్సిలర్ల బృందం ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించి, చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది సకాలంలో అందుబాటులో ఉంటున్నారా? మందులు, ఇతర వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని మౌలిక సదుపాయాలు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి రోగులను, సిబ్బందిని ఆరా తీశారు.
అనంతరం మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ యూనూస్ మాట్లాడుతూ, పేద ప్రజలకు వైద్యం అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రి పాత్ర కీలకమని పేర్కొన్నారు.వైద్య సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా, సకాలంలో అందుబాటులో ఉండి రోగులకు నాణ్యమైన చికిత్స అందించాలన్నారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి వార్డులో వైద్య బృందాలు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రజారోగ్యం విషయంలో మున్సిపాలిటీ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా చైర్మన్. యూనూస్ హామీ ఇచ్చారు. ఇదిలా ఉండంగా విధుల పట్ల ఓ డాక్టర్ నిర్లక్ష్యం చేసే విధులకు గైర్హాజరు కావడంపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో విధులకు గైరాజరైన వైద్యునికి మేము జారీ చేస్తానని ఆస్పత్రి సూపరింటెండెంట్ సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జమీల్, జాంగిర్, అక్రం, మహేష్ చౌహన్ వకీల్, జావిద్, నిజామ్ ఇర్మియా, రఫీ తదితరులు పాల్గొన్నారు.