ఐదు ఇండ్లలో దొంగతనాలు చేసిన ఇద్దరు దొంగలను అరెస్టు 

Uncategorized క్రైమ్ నల్లగొండ సూర్యాపేట

ఐదు ఇండ్లలో దొంగతనాలు చేసిన ఇద్దరు దొంగలను అరెస్టు 

   మీ:: న్యూస్ ప్రతినిధి:: సూర్యాపేట టౌన్ పోలీసులు:-19.10.2024 రోజు ఉదయం పాత నేరసుడైన గంపల శ్యామ్ తో పాటు రాడపంగి వీరబాబు అలియాస్ వినోద్ అను వారిని కొత్త బస్టాండ్ వద్ద అరెస్టు చేసి విచారించగా గంపల శ్యామ్ అను అతను గతంలో సూర్యాపేట పోలీస్ స్టేషన్ నుండి దొంగతనం కేసులో నల్గొండ జైలుకు వెళ్ళాడు అని, వీరబాబు అను అతను హుజూర్నగర్ పోలీస్ స్టేషన్ నుండి POCSO కేసులు నల్గొండ జైలుకు వెళ్ళాడు అని వారు ఇరువురు నల్గొండ జైల్లో పరిచయం అయ్యారని జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇంటి దొంగతనాలు చేద్దామని నిర్ణయించుకొని సెప్టెంబర్ నెలలో జైలు నుండి రిలీజ్ అయి ఇరువురు కలిసి సూర్యాపేట టౌన్ పరిధిలో 4 ఇళ్లలో మరియు చివ్వెంల పరిధిలో ఒక ఇంట్లో దొంగతనం చేసిన బంగారం ఈరోజు ఏదైనా బంగారు షాపులో అమ్ముదామని వెళుతుండగా వారిని సూర్యాపేట టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి అందాజ 3 తులాల బంగారు ఆభరణాలు మరియు 35 తులాల వెండి వస్తువులు రికవరీ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది.పై వారిని పట్టుబడి చేయడంలో ప్రతిభ కనబరిచిన టౌన్ సిఐ రాజశేఖర్ ని, ఎస్సైలు గోపికృష్ణ, కుశలవ, క్రైమ్ పార్టీ కానిస్టేబుల్స్ కృష్ణ, కరుణాకర్, సైదులు, కానిస్టేబుల్స్ శివ, మధులను సూర్యాపేట డిఎస్పి రవి అభినందించారు.