తెలంగాణ ప్రోగ్రె సివ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సన్మానం
•ప్రతి ఇంట్లో మహిళలు గౌరవించబడినప్పుడే ఆ కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుంది
•మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి. టి పి టి యు జిల్లా అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్
•తెలంగాణ ప్రోగ్రె సివ్ టీచర్స్ యూనియన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్
మీ న్యూస్ సూర్య పేట్ జిల్లా ఇంచార్జి:::ఆత్మకూర్(ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో యుపి ఎస్ స్కూల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రోగ్రె సివ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామయ్య ఘనంగా మహిళల దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ మహిళల అను రంగాలలో ముందుండాలని అవని నుండి అంతరిక్షం వరకు ప్రతి రంగంలో తనదైన ముద్ర వేసుకోవాలని కోరినారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ పురుషులతో సమానంగా ఎదుగుతున్నారని కొనియాడారు. మహిళా శక్తి దేశానికి వెన్నెముక వంటిదని, ప్రతి ఇంట్లో మహిళ గౌరవించబడినప్పుడే ఆ కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమ్ రెడ్డి శోభన్ హెడ్మాస్టర్ కోటపాడు. తోట పద్మ ప్రధానోపాధ్యాయురాలు తుమ్మల పెంపహాడ్. అనుప జయప్రద ఉపాధ్యాయురాలు తుమ్మల పెంపహాడ్. గంపల షర్మిల ఉపాధ్యాయురాలు తుమ్మల పెంపహాడ్. ఎర్రోజు మమత స్కాం మేజర్ గార్లకు ఘనంగా సన్మానం చేయడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ ప్రోగ్రాం టీచర్స్ యూనియన్ ఆత్మకూరు మండల అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఎలగందుల సుభాష్. చంద్ర బోస్. సుధీర్ నాయుడు. తల్లిదండ్రులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు