మీ:: న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్::సూర్యాపేట పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన జయంతి ఉత్సవ కార్యక్రమానికి హాజరై జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ *శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్తో పాటు మున్సిపాలిటీ కమిషనర్ బి శ్రీనివాస్ స్థానిక వార్డు కౌన్సిలర్ షేక్ తాహర్ పాషా ఈ సందర్భంగా భారతదేశం కోసం చేసిన పోరాటాన్ని మన స్వతంత్రాన్ని తీసుకువచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలతో దేశ రక్షణ కోసం ముందుకు సాగుతామని అన్నారు. తదన అనంతరం స్వచ్ఛ హి సేవ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ రెండో తారీకు వరకు జరిగిన కార్యక్రమంలో ఉత్తమ పారిశుద్ధ కార్మికులకు ప్రశంస పత్రాలను అందజేసి శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ నెంబర్ వెంపటి సురేష్,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఆకుల లవకుశ, బత్తుల జానీ యాదవ్, డి ఈ సత్య రావు,హెల్త్ అసిస్టెంట్ సురేష్, గౌస్, ఆఫీస్ సిబ్బంది, ఉత్తమ ప్రదర్శన చేసిన పారిశుద్ధ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.